38.2 C
Hyderabad
May 3, 2024 20: 50 PM
Slider ముఖ్యంశాలు

జోడో యాత్ర తో మోడీ లో కంగారు

#chintamohan

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల్లో నాలుగు రాష్ట్రాల పర్యటన చూస్తుంటే, భారత్ జోడో యాత్రకు బయపడి ఆయనలో కంగారు మొదలైందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో 9 వారాలుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ, లక్షల మందిని కలుస్తూ, కష్టసుఖాలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి  ప్రతిష్ట,  పునర్ వైభవం కొరకు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. రాజీవ్ హత్య నిందితులు విడుదలలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సరిగా లేదని,  కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆక్షేపనీయం అని,  కోర్ట్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ జైన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా చంద్ర స్వామి, మాజీ పీఎం చంద్రశేఖర్ పేర్లు ప్రస్తావించడం సిబిఐ, రా  సంస్థల విచారణను తుంగలో తొక్కడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి. పసలేని ఉపన్యాసాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు. మోడి పర్యటనలు ఆ పార్టీని మరింత వెనక్కు నెట్టబడతాయని, జోడో  యాత్ర తో కాంగ్రెస్స్ కు పునర్ వైభవం వస్తుందన్నారు.

Related posts

అంకిత్ శర్మ హత్యకేసులో తాహిర్ హుస్సేన్ అరెస్టు

Satyam NEWS

తప్పించుకుని తిరుగుతున్న ప్రధాని మోదీ

Satyam NEWS

క‌ర్ఫ్యూ లో రోడ్ల‌పైకి ఏంటీ? ఎస్పీ సూచ‌న‌ల‌తో జ‌రిమానాలు

Satyam NEWS

Leave a Comment