33.2 C
Hyderabad
May 3, 2024 23: 32 PM
Slider కరీంనగర్

124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం

#BR Ambedkar

దేశంలో బీఆర్‌ అంబేద్కర్‌ తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ అని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పర్యటించారు.

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కారించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలోని వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ ఆవిష్కరించారు. బాబు జాగ్జీవన్ రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ లో 124 మంది చిరు వ్యాపారులకు మంత్రులు ఆర్థిక సాయం అందజేశారు. దళిత బంధు పధకం కింద పలువురు లబ్ది దారులకు వాహనాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ప్రశాంగించారు. సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం కృషిచేసిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రామ్ అని మంత్రులు కొనియాడారు. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు.

జగ్జీవన్ రామ్ జీవితమే ఒక స్పూర్తి దాయకం మన్నారు. వారి స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన సాగుతున్నదని మంత్రులు చెప్పారు. పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దళితుల బాగుకోసం దేశంలో ఎవరూ చేయలేని విధంగా సీఎం కేసీఆర్‌ గారు దళితుల ఆత్మబంధువుగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.

తొలి దశలో ప్రభుత్వం అందించిన సాయంతో లబ్ధిదారులు ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారన్నారు. గత 50 ఏళ్ళ ప్రభుత్వాల పాలనలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

దళితబంధు పథకానికి రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు కేటాయించారని.. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని ప్రయోజనం చేకూరుతుందని, నియోజకవర్గానికి 1100 మందికి లబ్దిపొందుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న పధకాలతో దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని అన్నారు.

పోడు రైతులకు పట్టాలు పంపిణి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1614 మంది పోడు రైతులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి, గంభీరావుపేట మండ లాలు, వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, కోనరావుపేట, మానాల గ్రామాల్లో 2,859.34 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించారు.

Related posts

చెత్త సేకరణకు 36 చిన్న మున్సిపాల్టిలకు 516 ఆటోలు

Bhavani

ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకున్న పోలీసులపై వేటు

Satyam NEWS

భారీ వాహనాలు సిటీలోకి రానివ్వం..అంటున్న ట్రాఫిక్ సిబ్బంది…!

Satyam NEWS

Leave a Comment