26.7 C
Hyderabad
May 3, 2024 08: 16 AM
Slider విజయనగరం

భారీ వాహనాలు సిటీలోకి రానివ్వం..అంటున్న ట్రాఫిక్ సిబ్బంది…!

#Vijayagaram Police

విజయనగరం మున్సిపాలిటీ నుంచీ సంస్థ గా మారింది. విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ కావడంతో వార్డు నుంచీ డివిజన్ స్థాయికి మారింది. దీనికి నగర జనాభా కూడా పెరగడంతో ట్రాఫిక్ జామ్ లు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి.

ఇక డీఎస్పీ ర్యాంక్ అధికారితో విజయనగరం ట్రాఫిక్ సిబ్బంది వాహన రాకపోకలు, రద్దీ ,నియంత్రణ వంటి అంశాల పై ఆ శాఖ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో నగరంలోకి వాహన నియంత్రణ చర్యలను చేపట్టింది… నగర ట్రాఫిక్ విభాగం. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు ప్రమాదాల జరగకుండా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

 ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది నుంచీ రాత్రి పది వరకు నగరంలో భారీ వాహనాలను అనుమతించడం లేదు.తద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు… ప్రమాదాలను కూడా అరికట్టేయత్నంలో పడ్డారు….ట్రాఫిక్ పోలీసులు.

ఇటీవలే నగరంలో ని పోలీసు బ్యారెక్స్ నుంచీ కాంప్లెక్స్ వస్తున్న రహదారిపై ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద భారీ లారీ టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో ఎడమవైపు ఓ మారుతీ కారు ఇరుక్కు పోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. అలాగే కలెక్టరేట్ జంక్షన్ వద్ద కూడా ఓ ప్రమాదం జరిగింది.

జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ విభాగం గట్టి చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా మరుగున పడ్డ ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అమలు పరుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో కి భారీ వాహనాలను ఉదయం ఎనిమిది తర్వాత అనుమతించడం లేదు.

ఈ క్రమంలో విశాఖ నుంచీ భోగాపురం కు వెళుతున్న చేపల లోడు లారీ ఎత్తు బ్రిడ్జి పై  ట్రాఫిక్ సిబ్బంది పరశన్న అడ్డుకున్నారు.నిర్ణీత వేళల్లో నగరంలో ని భారీ వాహనాలు రాకూడదన్న ట్రాఫిక్ నిబంధనను చెప్పి…ఆ భారీ లారీని గజపతినగరం వైపు తిప్పి పంపించారు.

ఏదైనా నగరంలో ఈ నెలలో జరిగిన రెండు ఘటనలతో ట్రాఫిక్ పోలీసులు తమ జూలు విధిలిస్తున్నారనే చెప్పాలి.

Related posts

BTC Bitcoin rates, news, and tools

Bhavani

కొల్లాపూర్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS

Leave a Comment