39.2 C
Hyderabad
May 3, 2024 11: 55 AM
Slider సినిమా

‘పగ పగ పగ’ ఫస్ట్ గ్లింప్స్‌: విలన్‌గా సంగీత దర్శకుడు కోటి

#musicdirectorkoti

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాతగా సత్య నారాయణ సుంకర, సహ నిర్మాతగా సత్యవతి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.

రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా పోస్టర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయించారు. మోషన్ పోస్టర్ చూపించిన తీరు, అందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంతో  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రతి నాయకుడిగా పరిచయం కాబోతోన్నారు.

కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కోటి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అందరినీ మెప్పించారు. ‘హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు’ అంటూ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్లు ప్రకటిచనున్నారు.

సాంకేతిక వర్గం

దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్, నిర్మాత : సత్య నారాయణ, సహ నిర్మాత :సత్యవతి, సంగీతం : కోటి, కెమెరామెన్  : నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్ : పాపారావు, ఫైట్స్ : రామ్ సుంకర, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Related posts

జైపాల్ రెడ్డికి ఘన నివాళి అర్పించిన కౌన్సిల్ చైర్మన్

Satyam NEWS

నేనింతే ఫేమ్ శియా గౌతమ్ సినిమా త్వరలో ప్రారంభం

Satyam NEWS

వానలు కురువాలంటే.. మల్లయ్యకు జాతర చేయల్చిందే !!

Bhavani

Leave a Comment