27.7 C
Hyderabad
May 4, 2024 09: 18 AM
Slider ముఖ్యంశాలు

తిరుమలలో మరో అయిదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

#cheetah movements

తిరుమల కాలిబాటల సమీపాన మళ్లి ఐదు చిరుతల కదలికలు కనిపించాయి,నామాల గవి, నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో ఐదు చిరుతల కదలికలు గుర్తించారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు బోన్లు పెట్టి మూడు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే.తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాప్‌ కెమెరాల ఆధారంగా ఇంకా ఐదు చిరుతలు ఉన్నట్లు- అధికారులు గుర్తించారు.

అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి..వాటిని ఎలా బంధించాలి అనే దానిపై అటవీ శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది. త్వరలో వాటిని బంధించి జూకు తరలిస్తామని డిఎఫ్‌ఓ సతీష్‌రెడ్డి చెపుతున్నారు.గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, అడవికి సమీపాన ఉండే గెస్ట్‌హౌస్‌ల వద్ద మాత్రమే కనపించిన వన్యమృగాలు..

ఇటీవల జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే ధైర్యంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. నడకదారి భక్తబృందంలోని ఓ బాలుడిపైన చిరుత దాడి చేసి గాయపరచడం, ఇటీవల బాలిక లక్షితను ఓ పొట్టన పెట్టుకోవడడం వంటి సంఘటనలతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నా యి.

Related posts

కరోనా పై పోరాటానికి హెరిటేజ్ ఫుడ్స్ రూ.కోటి

Satyam NEWS

ఈ సారి రేషన్ లో కందిపప్పు ఇవ్వడం లేదు

Satyam NEWS

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోటీపడి రైతులను మోసం చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment