42.2 C
Hyderabad
April 26, 2024 18: 40 PM
Slider నల్గొండ

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోటీపడి రైతులను మోసం చేస్తున్నారు

#cituhujurnagar

భారతదేశంలో రైతులు పోరు బాట పట్టి చేసిన ఉక్కు పోరాటం నేటికి సంవత్సరం‌ పూర్తైందని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ కార్యాలయంలో శీతల రోషపతి మాట్లాడుతూ 3 వ్యవసాయ చట్టాలను రద్దును స్వాగతిస్తూ కనీస మద్దతు ధర కల్పించాలని,విద్యుత్ బిల్లు రద్దు చేయాలని పార్లమెంటులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పోటీపడి మోసం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల 3 లేబర్ కోడులను తక్షణమే రద్దు చేయాలని,రాష్ట్రంలో రైతులు వర్షానికి కళ్ళాలలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఖరీదు చేసి రైతులను కాపాడాలి డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులఅందరికీ ఉచితంగా హెల్పర్ బోర్డులో సభ్యులుగా చేర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యులు సోమయ్య గౌడ్, గోవిందు,రామకృష్ణ,లక్ష్మి,పాపయ్య, లింగమ్మ,దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

త్వరలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

Satyam NEWS

గీతాంజలి సినిమాతో పోల్చడం హ్యాపీ గా ఉంది: తమన్నా

Bhavani

Leave a Comment