37.2 C
Hyderabad
May 6, 2024 20: 55 PM
Slider కర్నూలు

తుంగభద్రకు వరద: 50 టీఎంసీలకు చేరుకున్న నిల్వలు

#tungabhadra

తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. తుంగభద్ర జలాశయం ఎగువన కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాం వరద నీటితో ఉప్పొంగుతోంది. గత నాలుగు రోజుల నుంచి తుంగభద్ర జలాశయం కు వరద కొనసాగుతుంది. సోమవారం ఉదయం 44 వేల క్యూసెక్కుల ప్రవాహం తో మొదలై, అదే రోజు మధ్యాహ్నంకు 55 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆ తర్వాత బుధవారం ఉదయం నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా  జలాశయంకు ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. నిన్నటి వరకు  20 టీఎంసీలకు మించి నీరు ఉండేది కాదు. ప్రస్తుతం 50 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. గురువారం ఉదయం తుంగభద్ర ప్రాజెక్టు నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1615.56 అడుగులకు చేరుకుంది.ఇక జలాశయం కు 113981  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు ద్వారా వివిధ కాలువలకు 107 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.

Related posts

ఇద్దరు పాత నేరస్తుల దారుణ హత్య

Satyam NEWS

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు

Satyam NEWS

కిటకిటలాడిన బాసర దేవాలయం

Satyam NEWS

Leave a Comment