38.2 C
Hyderabad
April 29, 2024 20: 38 PM
Slider ప్రత్యేకం

సీఎం జగన్ రెడ్డి తో తమ్ముడు అవినాష్ రెడ్డి భేటీ

#jagan

బాబాయ్ వివేకా హత్య కేసుపై కీలక చర్చ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సీఎం జగన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  ఆయన జగన్‌తో భేటీ అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి.. జగన్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవినాష్ రెడ్డి జగన్ రెడ్డిని కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. వీరిద్దరి భేటీలో ఏ విషయాలపై చర్చించారు?

ఏ అంశాలపై భేటీ అయ్యారు? బాబాయ్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాబాయ్ వివేక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఇటీవలే కొత్త సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ రాసిన కొద్దిరోజుల్లోనే జగన్‌ తో భేటీ కావడం చర్చ నీయాంశం అయింది. సీబీఐకు అవినాష్ రెడ్డి రాసిన లేఖపై సొదరులిద్దరూ చర్చించినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి?

ఎలా అమలు చేయాలి? ప్రజల్లోకి ఏ ఏ అంశాలను తీసుకు వెళ్ళాలి? అనే విషయాలపై వీరుభయులు చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు అవినాష్ రెడ్డి హాజరు కాకుండా సీఎం జగన్ రెడ్డి తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు బాబాయ్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరును సీబీ చార్జిషీట్ లో 8వ నిందితుడిగా చేర్చినవిషయం తెలిసిందే.

దీంతో పలుమార్లు అవినాష్ రెడ్డి ని సీబీఐ ప్రశ్నించింది. ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో చార్ట్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన చార్ట్ షీట్ లోని కీలకమైన సాక్షుల వాగ్మూలాలు వెలుగులోకి రావడం.. అందులో అవినాష్ రెడ్డి ప్రస్తావన వుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మాజీ మంత్రి డి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు.

సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు అవినాష్ రెడ్డి అప్పట్లో. ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఆయనపై ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని పేర్కొన్నారు. పక్షపాత వైఖరితో రామ్‌ సింగ్ దర్యాప్తు చేశారంటూ ఆరోపించారు. రామ్‌ సింగ్ హయాంలో జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించాలని అవినాష్‌ రెడ్డి కొత్త సీబీఐ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్ల ఆధారంగా అవినాష్ రెడ్డి ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్‌మెంట్ అంశాలను సైతం ఆయన తన లేఖలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. రెండో భార్య షమీమ్‌ తో ఆస్తి తగాదా ఉన్న విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి తన లేఖలో పొందుపరిచారు. ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే వివేకాను హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.

ఆస్తి కోణంలో ఇప్పటివరకూ విచారణ జరగలేదని అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులని సవరించాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. బాబాయ్ హత్య కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సోదరులైన సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిల భేటీ సర్వత్రా చర్చకు దారితీసింది.

Related posts

అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్న కేసీఆర్‌

Murali Krishna

బిజెఆర్ కాలనీ అధ్యక్షులు రహీమ్ నివాసంలో ఘనంగా రంజాన్ వేడుకలు

Satyam NEWS

అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆక్రమణదారులు

Satyam NEWS

Leave a Comment