41.2 C
Hyderabad
May 4, 2024 18: 38 PM
Slider విజయనగరం

ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఎస్పీ సాక్షి గా ఆగిపోయిన ఆర్టీసీ బస్సు…

వరుసగా ఆరో సారి…ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మూడో సారి…!

విజయనగరం ఆర్టీసీ డిపో కు గ్రహణం పట్టిందన్న చందంగా మరో ఆర్టీసీ బస్ అకస్మాత్తుగా  విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆగిపోయింది. వరుసగా ఆరోసారి ఆర్టీసీ బస్సు అదీ ప్యాసింజర్ సర్వీస్ మొరాయించడం విశేషం. తాజాగా… విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చింతపల్లి నుంచీ విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు… కోట నుంచీ ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తూ…ఐనాక్స్ వద్ద కుడి వైపు తీసుకుంటుండంగా అకస్మాత్తుగా ఆగిపోయింది.

బస్సు ఫ్రంట్…పార్టీ లో సమస్య రావడంతో బస్సు మరి కదలనని మొరాయించడంతో ఆర్టీసీ గ్యారేజ్ నుంచీ మెకానికల్ సిబ్బంది వచ్చి.. మరమ్మతులు చేస్తున్న క్రమంలో అక్కడికక్కడే వాహనాలు ఆగిపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ గా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ క్రమంలో నే నగరంలో ని కస్పా ,సంస్కృతిక కళాశాల లను ఎంఎల్సీ ఎన్నిక సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల ను జిల్లా కలెక్టర్ ,ఎస్పీ లు పరిశీలించి… తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ జామ్ లో కాసేపు ఐనాక్స్ వద్ద వాళ్ళ వెహికిల్స్ ఇరుక్కుపోయాయి.

ఆ సమయంలో ప్రోటోకాల్ వెహికిల్.. లో ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు..ఏఎస్ఐ విజయ్ లతో పాటు హోమ్ గార్డ్ గోపాల్.. మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ ..ట్రాఫిక్ ను క్లియర్ చేసి…కలెక్టర్, ఎస్పీల వెహికిల్స్ ను శర వేగంగా ఆ ట్రాఫిక్ చక్ర బంధనం నుంచీ తప్పించే చర్యలు చేపట్టారు. అంతలో…ఆగిపోయిన బస్…కదిలేందుకు సిద్ధమైనప్పటికీ…జిల్లా అధికారులు వాహనాలు తో పాటు భారీ గా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇక మెకానిక్ లో ఆగిపోయిన, ఆర్టీసీ బస్సు ను తోసుకుని .ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి తీసుకురావడం…ఆ లోపేట్రాఫిక్ ను కాస్త క్లియర్ చేయడంతో కలెక్టర్, ఎస్పీ వాహనాలు సజావుగా… వెళ్లిపోయాయి.ఏదైనా నడిరోడ్డుపై అదీ మాడు పగిలే ఎండలో ఆర్టీసీ బస్ ఆగిపోవడంతో అటు వాహనదారులతో పాటు ఆగిపోయిన వాహనాలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం.

Related posts

తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరించుకున్న భారత్ చైనా

Satyam NEWS

దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి గ్రామగ్రామాన నిర్వహించాలి

Satyam NEWS

ప్రజాసమస్యలపై బిజెపి నేతల పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment