33.7 C
Hyderabad
April 29, 2024 00: 29 AM
Slider జాతీయం

గెటప్ మార్చిన రాహుల్ గాంధీ

#rahulnewgetup

రాహుల్ గాంధీ గెటప్ మార్చారు. భారత్ జోడో యాత్రలో తన పొడవాటి జుట్టు, తెల్ల గడ్డం లుక్‌లో కనిపించిన రాహుల్ గాంధీ కొత్త లుక్ తెరపైకి వచ్చింది. లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో జరిగిన ఒక ఈవెంట్‌ లో ఆయన తన కొత్త ఈ లుక్‌ తో కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలలో, రాహుల్ గాంధీ పొట్టి జుట్టుతో, కత్తిరించిన గడ్డం, మీసాలతో కనిపించాడు.

రాహుల్ తన ట్రేడ్‌మార్క్ తెల్లటి టీ-షర్ట్‌కు బదులుగా కోటు-టైలో అక్కడ కనిపించాడు. ఆయన నయా లుక్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బ్రిటన్‌లో వారం రోజుల పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తారు. భారతీయ ప్రవాసులతో సంభాషిస్తారు.

కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ (కేంబ్రిడ్జ్ JBS)లో విజిటింగ్ ఫెలోగా రాహుల్ ’21వ శతాబ్దంలో వినడం-అభ్యాసం’ అనే అంశంపై ఉపన్యాసం ఇస్తారు.”మా కేంబ్రిడ్జ్ ఎంబీఏ ప్రోగ్రాంను భారతదేశంలోని ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది” అని కేంబ్రిడ్జ్ JBS మంగళవారం ట్వీట్ చేసింది.

Related posts

ఆసుపత్రిలో చేరనున్న ఎం ఎస్ ధోని

Satyam NEWS

ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివి

Satyam NEWS

కరోనా మందుల బ్లాక్ మార్కెటీర్ల రాకెట్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment