39.2 C
Hyderabad
May 4, 2024 20: 27 PM
Slider జాతీయం

మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.. 13 ఏళ్ల విచారణ

13 ఏళ్ల క్రితం విద్యార్థినిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్‌కు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షతో పాటు అతనికి రూ.30,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బిల్సీ నుండి 2008 ఏప్రిల్ 23న ఇరవై ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని అపహరించి, ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినందుకు న్యాయమూర్తి అఖిలేష్ కుమార్ అతన్ని దోషిగా నిర్ధారించారని అదనపు ప్రభుత్వ న్యాయవాది మదన్‌లాల్ రాజ్‌పుత్ తెలిపారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య, కోవిడ్‌ పరీక్షల కోసం తీసుకెళ్లారు.

యోగేంద్ర సాగర్ సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఇప్పటి వరకు బయట ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన బుదౌన్ జిల్లాలోని బిల్సీ స్థానం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే కాలేజీ యువతిపై అఘాయిత్యానికి పాల్పడట్లు పోలీసులు తేల్చారు.

Related posts

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు

Murali Krishna

వనపర్తిలో హిందువాహిని జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

ఆధ్యాత్మికతకు నెలవు వేణి సోంపురం పుష్కర ఘాట్

Sub Editor

Leave a Comment