చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని తెలిసింది. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన వారుగా తెలుస్తోంది. కలకడ మండలం, కెవిపల్లి మండలాల సరిహద్దులో మహాల్ క్రాస్ సమీపంలో ఈ దారుణం జరిగింది. పీలేరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నది. దాంతో ప్రమాదం సంభవించి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయి మరణించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
previous post