37.7 C
Hyderabad
May 4, 2024 13: 04 PM
Slider నిజామాబాద్

మాజీ సర్పంచ్ అదృశ్యం: తన చావుకు నలుగురు కారణమని సెల్ఫీ వీడియో

#policecase

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి మాజీ సర్పంచ్ సత్యాగౌడ్ అదృశ్యం కలకలం రేపుతోంది. తన చావుకు ఆ నలుగురే కారణం అంటూ తీసిన సెల్ఫీ వీడియోతో కుటుంబ సబ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన సత్యాగౌడ్ గ్రామ సర్పంచ్ భర్త అధికం నర్సాగౌడ్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టై ఇటీవల బెయిలుపై బయటకు వచ్చాడు. తాను గ్రామంలో సిసిరోడ్డు పనులు చేశానని, దాని బిల్లుకు సంబంధించిన చెక్కు వచ్చినా పని చేసినట్టు రుజువు ఏంటి అని ఎంపీఓ సరితా చెక్కు ఇవ్వలేదన్నారు.

చెక్కు తనకు రాకుండా గ్రామానికి చెందిన అధికం రాజేందర్ గౌడ్, తోట భూమయ్య, గొల్ల అంజయ్య, ఇసాయిపేట సర్పంచ్ బాలాగౌడ్ కలిసి చెక్కును అధికం నిఖిల్ గౌడ్ రాసుకున్నారని సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే సైతం తాను చేసిన పనికి సర్పంచ్ వాళ్లనే డబ్బులు డ్రా చేసుకొమ్మని చెప్పారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే అప్పుల బాధ తాళలేక అర ఎకరం భూమి అమ్ముకున్నానని, ఇప్పుడు డబ్బులు రాకుండా అడ్డుకోవడంతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుంటానని పేర్కొన్నాడు.

తన చావుకు ఆ నలుగురే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని, మొబైల్ ఫోన్, బైకు ఇంటివద్దనే ఉంచి ఆదివారం ఇంటినుంచి వెళ్లిపోయాడని సత్యాగౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు. బెయిలుపై వచ్చిన నుంచి కామారెడ్డిలోని రాజీవ్ నగర్ కాలనిలో ఉంటున్నామని తెలిపారు. నేడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సత్యాగౌడ్ అదృశ్యం అయినట్టు ఫిర్యాదు చేశారు.

Related posts

బేగంపేటలో టిడిపి అభ్యర్ధికి విశేష మద్దతు

Satyam NEWS

డాక్టర్ పి.పట్టాభి ని సన్మానించిన హుజూర్ నగర్ నియోజకవర్గ కళాకారులు

Satyam NEWS

విక్టరీ: మంత్రి ఎర్రబెల్లికి అభినందనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment