Slider మెదక్

మెదక్ పట్టణంలో సందడిగా ఫ్రీడమ్ రన్

#medakpolice

రాబోయే తరాలకు భారత జాతి స్వాతంత్రం ఖ్యాతి, ప్రాముఖ్యతను  తెలియజేయడం మనందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ హారీష్ అన్నారు. నేడు మెదక్ జిల్లా మెదక్ పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా  ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.

జిల్లా అదనపు ఎస్.పి డా. బి.బాలస్వామి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రన్ మెదక్ పట్టణం నుండి న్యూ బస్ స్టాండ్ మీదుగా రాందాస్ చౌరాస్తా వరకు కొనసాగింది.  పోలీస్ అధికారులు సిబ్బంది,ప్రజాప్రతినిదులు,వివిద స్కూల్ కళాశాలల విద్యార్ధులు  జాతీయ త్రివర్ణ జెండాలను పట్టుకుని  ఫ్రీడమ్ రన్నింగ్ లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  భారత్ మాతాకీ జై, జై హింద్  అంటూ నినాదాలు చేసుకుంటూ విజయవంతంగా రన్నింగ్ కొనసాగింది.

జిల్లా అదనపు ఎస్.పి డా.బి.బాలస్వామి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఫ్రీడం రన్ లో వివిధ డిపార్ట్మెంట్ అధికారులుచ సిబ్బంది, పోలీస్ అధికారులు సిబ్బందిని పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందించారు.

స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు కష్ట,నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మహనీయులను స్మరిస్తూ, స్వతంత్ర ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందని ఆయన అన్నారు.

ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి,దేశ సమైక్యతను దశదిశల వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల  త్యాగాలను కీర్తించుకొనడానికి ఉద్దేశించబడినది అని అన్నారు. మన రాబోవు తరాల గురించి భారత జాతి ఖ్యాతిని  స్వతంత్ర పోరాటం ఫలితాలను, స్వాతంత్రం ప్రాముఖ్యతను  తెలియపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.

స్వతంత్రం పటిమ గురించి విద్యార్థులకు అవగాహన గురించి గాంధీ సినిమాను మెదక్  జిల్లాలో  విద్యార్థిని విద్యార్థులకు చూపించడం జరుగుతుందని తెలిపారు ఈనెల 22 వరకు జరిగే కార్యక్రమాలలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, రమేష్,మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్,వైస్  ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్  ,మెదక్ డి.ఎస్.పి.సైదులు,మెదక్ పట్టణ మరియు రూరల్ సి.ఐ లు,  ప్రజాప్రతినిదులు,వివిద శాఖల అధికారులు, స్కూల్ కళాశాలల విద్యార్ధిని విద్యార్ధులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వందనం

Satyam NEWS

పడవ ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

Bhavani

Leave a Comment