29.7 C
Hyderabad
April 29, 2024 08: 10 AM
Slider కవి ప్రపంచం

వందనం

#Dr.Sammeta Vijaya

చెమట చిందించే పనితనం నీదే

పస్తులుండి పిల్లలకు పెట్టే తల్లిప్రేమ నీదే

పొద్దున్నే లేచి పాచిపనులు చేసి

పనికోసం పరుగులెత్తి

రెక్కలు ముక్కలుగ చేసుకుని

బొంగరంగా గిరగిరా తిరిగి వచ్చి

ఇంటి పనులు చేసి

అన్నం పెట్టే అన్నపూర్ణ నీవే

అవిశ్రాంత జీవనంలో

కంటిమీద కునుకు లేదు

కడుపు నిండా తిండీ లేదు

అయినా తాగివచ్చి తంతే

మొగుడితో దెబ్బలు తింటావు

ఊరూ వాడా పంచాయితీలో

నిలబడి పోరాడుతావు

కన్నబిడ్డలకోసం ఆరాటపడతావు

రాత మార్చాలని బడులకు తోల్తావు

నిలువ నీడ కోసం నానా పాట్లు పడతావు

చిట్టీలు కడతావు

చిల్లర కూడేస్తావు

గుట్టుగా బతకాలని బండచాకిరీ చేస్తావు

ముప్పతిప్పలు పెడుతూ

కష్టాన్ని కర్పూరంగా కరిగించే మొగుడితో

సర్దుకుపోతుంటావు

మనుగడకోసం పోరాడుతూ బిడ్డను చుట్టుకుని

ఇటుకలు మోస్తావు

నిన్నే చూసే ఆ బిడ్డలో ఆనందాన్ని

ఎన్ని కుంచెలతో  చిత్రించను

ఎన్ని మాటలతో నీ శ్రమను వర్ణించను

శ్రమైకజీవన సౌందర్యానివి నీవు

బతుకు పాటలో రాగం నీవు

నిత్యపోరాట విజయం నీవు

ఎందరికో స్ఫూర్తినిచ్చే ధీరవనితవు నీవు

డా.సమ్మెట విజయ

Related posts

ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి

Bhavani

శ్రీశైలం దేవస్థానాన్ని కొల్లగొట్టిన సిబ్బందికి ఉచ్చు

Satyam NEWS

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

Leave a Comment