32.2 C
Hyderabad
May 12, 2024 22: 56 PM
Slider పశ్చిమగోదావరి

నకిలీ వేలిముద్రతో 14వ ఆర్ధిక సంఘం నిధుల దోపిడి

#pedavegi mandal

ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామ పంచాయతీలో అధికారికంగా విధులు నిర్వహించే స్పెషలాఫీసర్ వేలిముద్ర తో కాకుండా నకిలి స్పెషలాఫీసర్ 14వ ఆర్థిక సంఘ నిధులను దోపిడీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వేలిముద్రవేసి రాట్నాలకుంట పంచాయతీ నుండి నిధులు దోపిడీ చేశారనే కుంభకోణం బయటపడే వరకు జిల్లా అధికారులకు కింది అధికారులు చెప్పలేదు.

అప్పటి మండలాధికారి ఒకరు నకిలీ వేలి ముద్ర వేసి రాట్నాలకుంట పంచాయతీ సి ఎఫ్ ఎం ఎస్  ఖాతానుండి 8 లక్షలు రూపాయలు దోపిడి చేశారు. బయటపడిన ఈ కుంభకోణం పై విచారణాధికారులు అప్పటి డి ఎల్ పి ఓ, అప్పటి డి ఆర్ డి ఏ పి డి లను వేరు వేరుగా నాలుగు గోడల మధ్య  రహస్య విచారణ చేసినట్టు సమాచారం.

అయితే ఆ విచారణ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదని పెదవేగి మండల ప్రజలు జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాట్నాలకుంట పంచాయతీ లో జిల్లా కలక్టర్ ఉత్తర్వుల తో అప్పటి స్పెషలాఫీసర్ గా పెదవేగి మండల  ఈ ఓ అండ్ పి ఆర్ డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను విధుల నుండి తాత్కాలికంగా తప్పించి ఈ దోపిడీకి తెర లేపారని అప్పటి సమాచారం.

మండలం లో సుమారు 20 పంచాయతీలలో ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్ గా ను, కొంతమంది కార్యదర్శులకు నకిలీ బిల్లులు తయారు చేసే మేనేజర్ గా  చలామణి అవుతున్న వ్యక్తి తో రాట్నాలకుంట పంచాయతీ కి నకిలీ స్పెషలాఫీసర్ గా నకిలీ ఆర్డర్ రూపొందించి ఆ ఆర్డర్ ను అడ్డుపెట్టుకుని అప్పటి మందళాధికారి పంచాయతీ కార్యదర్శి సహకారం తో  ఆ పంచాయతీలో ఉన్న 14వ ఆర్థిక సంఘ నిధులు దోపిడీ చేసి నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

8 లక్షల నిధులు దోపిడీ వ్యవహారం పై జిల్లా అధికారులు అప్పటి డి ఎల్ పి ఓ తో విచారణ జరిపించారు. ఆ విచారణకు విలేకరుల ను కూడా అనుమతించ కుండా పంచాయతీలలో నకిలీ బిల్లులు తయారుచేసే ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్ ని విచారణ లో ఒక భాగస్వామ్యుడుగా పాల్గొనడం పై మండల విలేకరులకు విచారణాధికారికి కొద్దిసేపు వాగ్వివాదం కూడా జరిగినా విలేకరులను అనుమతించక పోవడం విశేషం.

ఈ విచారణ పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో నాలుగు గోడల మధ్య జరగడం పై పలు అనుమానాలు అప్పట్లోనే కొంతమంది కార్యదర్సులలో రేకెత్తాయి. ఇప్పటికి కూడా 8 లక్షలు 14 వ ఆర్థిక సంఘ నిధులు దోపిడీ చేసి మింగేసిన అధికారిపైన గాని, స్పెషలాఫీసర్ విధుల నుండి అనధికారికంగా తొలగించినా ఈ ఓ అండ్ పి ఆర్ డి పై గాని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడం విశేషం. అసలు ఈ వ్యవహారమంతా స్పెష లా పీసర్ గా ఉన్న ఈ ఓ పి ఆర్ డి కి తెలిసే జరిగిందా అనే అనేక అనుమానాలను పెదవేగి మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

విద్యార్థుల  విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు

Murali Krishna

కల్వకుర్తి నూతన న్యాయమూర్తిగా కావ్య

Satyam NEWS

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందిస్తా

Satyam NEWS

Leave a Comment