40.2 C
Hyderabad
April 29, 2024 17: 52 PM
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందిస్తా

#nagarkurnoolcollector

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఆయన బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 16 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల్లో ప్రతిరోజు శానిటేషన్ చేయాలన్నారు.  ఏ ఒక్క విద్యార్థికి కోవిడ్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. 

విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని పేర్కొన్నారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వంద శాతం అమలు చేసే విధంగా చూడటం జరుగుతుందని పారిశుధ్యం విషయంలో రాజిపడే ప్రసక్తి లేదన్నారు.   ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుధ్యం ప్రధానమైనది తెలియజేసారు. 

2019 – 2020  హరితహారంలో నాటిన మొక్కల మూల్యాంకనం ప్రారంభమైనందున నియమితులైన కమిటీ సభ్యులు తమ నివేదికలను పకడ్బందీగా రూపొందించి సకాలంలో అందించే విధంగా చూడాలని సూచించారు.  ఈ సంవత్సర హరితహారం మొక్కలు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వంద శాతం మొక్కలు నాటే విధంగ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.

ఆదనవు కలెక్టర్ మను చౌదరి కలెక్టర్ ను స్వాగతం పలుకగా  జిల్లా అధికారులు మొక్కలు, పూల బొకేలతో స్వాగతం పలికారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

స్థానిక ఎన్నికలను సంతృప్తిగా నిర్వహించాం

Satyam NEWS

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS

రాష్ట్రపతిని కించపరిచిన పశ్చిమబెంగాల్ మంత్రిని అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment