30.7 C
Hyderabad
April 29, 2024 04: 58 AM
Slider విశాఖపట్నం

సీబీఐకి చిక్కిన వైజాగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్  

cbi

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును క్లియర్ చేసినందుకు, వ్యవసాయ వస్తువుల దిగుమతి,ఎగుమతి కోసం కస్టమ్స్‌కు అనుకూలమైన ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినందుకు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంతీయ మేనేజర్ నుండి లంచం తీసుకున్న భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు చెందిన ఒక అధికారిని సీబీఐ నేడు అరెస్టు చేసింది.

అతని నుంచి కోటీ 86 లక్షల రూపాయలను కూడా సీబీఐ స్వాధీనం చేసుకున్నది. విశాఖపట్నంలో ఉన్న , డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజ్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఈ నేరానికి పాల్పడ్డట్లు సీబీఐ తెలిపింది. ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ తో బాటువిశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ రీజినల్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఫైటోసానిటరీ సర్టిఫికేట్‌ల జారీ కోసం CHAలు, ఫ్యూమిగేటర్లు దిగుమతి చేసుకోవడానికి షిప్పింగ్ ఏజెంట్ల నుండి భారీ మొత్తంలో అతను లంచాలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

వస్తువులను ఎగుమతి చేయడం మరియు దిగుమతి చేసుకున్న సరుకుల కోసం సరుకుల విడుదల ఆర్డర్‌లు జారీ చేయడానికి కష్టమ్స్ కు వీలు కల్పించే సర్టిఫికెట్లను కూడా అతను లంచం తీసుకుని జారీ చేసేవాడు. విశాఖపట్నం, కాకినాడ, రూర్కీ (ఉత్తరాఖండ్)లో ఉన్న అతని సహచరులతో సహా ఇతరుల ఇళ్లలో సీబీఐ ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాలలో అతని నుంచి కోటీ 86 లక్షల రూపాయలను కూడా సీబీఐ స్వాధీనం చేసుకున్నది.

Related posts

నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై పునరాలోచించాలి

Satyam NEWS

ఈ మంత్రులు ఉన్నది ఎందుకు?

Satyam NEWS

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్ కల్యాణ్

Satyam NEWS

Leave a Comment