33.2 C
Hyderabad
May 4, 2024 02: 14 AM
Slider ముఖ్యంశాలు

దుల్హన్, విదేశీ విద్య వంటి పథకాలకు నిధులు లేవని చెప్పటం సిగ్గుచేటు

#potulabalakotaiah

రాష్ట్ర ప్రభుత్వం క్రింది కులాల సంక్షేమంపై మడెం తిప్పిందని, నయ వంచనకు పాల్పడుతున్నదని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య  ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ కులాల వివాహాలకు దుల్హన్ పథకం తో గత ప్రభుత్వం రూ.50వేలు ఆర్థిక సహాయం ఇచ్చిందని, పాదయాత్రలో  ఇదే పథకానికి రూ.లక్ష ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

దుల్హన్, విదేశీ విద్య వంటి పథకాలకు నిధులు లేవని  కోర్టుకు చెప్పటం సిగ్గుచేటు అని అన్నారు. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ లకు అమలు చేస్తున్న 27రకాల  సంక్షేమ పథకాలను కూడా మూడేళ్ళుగా ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. నిరుపేదల భూమి పంపిణీ, కార్పోరేషన్ రుణాలు, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు పారితోషికం పథకాలు ఏవీ? అని ప్రశ్నించారు.

క్రింది కులాలైన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలను వివక్షత నుంచి కాపాడేందుకు పెట్టిన పథకాలపై వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. వైకాపా ప్రకటించిన నవరత్నాలకు అన్నీ చిల్లులే అన్నారు. ఈ ఏడాది మూడు లక్షల మంది తల్లుల ఖాతాలను అమ్మ ఒడి నుంచి తప్పించారని చెప్పారు.

ఒంటరి మహిళల వయస్సు 35 నుంచి 50 ఏళ్ళకు మార్చుతూ జివో తెచ్చారని వెల్లడించారు. ఒక వైపు ప్రజలపై పన్నుల భారం, మరో వైపు లక్షల కోట్ల అప్పుల కుంపటి ప్రజలపై పెడుతూ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకపోవడం మోసం కాదా?అని బాలకోటయ్య వివరించారు.

Related posts

హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో స్కై వర్త్ కంపెనీ

Satyam NEWS

రెండు రోజుల్లో పోడు పట్టాల ప్రక్రియ పూర్తి

Bhavani

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సన్నాహక కమిటీ సభ్యుడికి ఆత్మీయ సన్మానం

Satyam NEWS

Leave a Comment