41.2 C
Hyderabad
May 4, 2024 17: 43 PM
Slider ఖమ్మం

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

#ponguleti

ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ (పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి) ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య, సూతకాని జైపాల్ తెలిపారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో వారు వివరాలు వెల్లడించారు. పీఎస్ఆర్ ఛాంపియన్షిప్ ట్రోఫీ పేరుతో 28 నుంచి 31 వరకు ఖమ్మంలో కబడ్డీ, కొత్తగూడెంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇరు పోటీలలో విజేతలకు మొదటి బహుమతి రూ. లక్ష, తర్వాత స్థానాల్లో నిలిచిన ఏడు జట్లకూ నగదు బహుమతులు ఉంటాయని వివరించారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్, ప్రోమోలను పీఎస్ఆర్ ట్రస్ట్ బాధ్యులు ఆవిష్కరించారు. ఈ టోర్నీలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

ఖమ్మంలో కబడ్డీ పోటీలు

ఖమ్మంలోని సర్దార్ పటేల్  స్టేడియం లో  28,29,30వ తేదీల్లో జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా మ్యాట్లపై డే అండ్ నైట్ కబడ్డీ పోటీలు పురుషులు, మహిళల విభాగాల వారీగా నిర్వహిస్తున్నామన్నారు. ఆహ్వానిత టీంలు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. సుమారు 400 మందికి పైగా హాజరయ్యే వారిలో జాతీయస్థాయి క్రీడాకారులు సైతం ఉన్నారని తెలిపారు.

జూనియర్స్ కు కొత్తగూడెంలో వాలీబాల్ పోటీలు

వాలీబాల్ అసోసియేషన్ గుర్తింపు పొందిన బాలబాలికలకు జూనియర్స్ విభాగంలో కొత్తగూడెంలోని ప్రకాశ్ స్టేడియంలో 28,29,30,31వ తేదీల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని ట్రస్ట్ బాధ్యులు పేర్కొన్నారు. సుమారు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్ మలీదు జగన్, మైనార్టీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, చింతమళ్ల గురుమూర్తి, మియాభాయ్, ఉమ్మినేని కృష్ణ, కీసర పద్మజారెడ్డి, కొంగర జ్యోతిర్మయి, విజయలక్ష్మి, గుడిపూడి రజనీకాంత్, వట్టికూటి సైదులు గౌడ్, చావా ప్రవీణ్, మెండె వెంకటేష్ యాదవ్, శేఖర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS

నిరాహారదీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం

Satyam NEWS

Leave a Comment