ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్న శివ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు.
90 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 3 వేల కిలోమీటర్లు కాలినడకన తిరుగుతూ అయిదు రాష్ట్రాల్లోని ప్రజలకు రక్తదానం పై అవగాహన కల్పించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కు స్థానం సంపాదించినందుకు శివను సీపీ అభినందించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన గండు శివ (24) కన్యాకుమారి లో నడక ప్రారంభించి కేరళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం తో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకు గాను ఆయనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కింది.
గతేడాది లాక్డౌన్ సమయంలో తన బంధువు ఒకరు రక్తం దొరకక ఇబ్బంది పడడంతో రక్తదానం పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రచారం కాల్పిస్తున్నానని గుండు శివ తెలిపారు. ఇప్పటివరకూ అతను 24 రక్తదాన శిబిరాలు నిర్వహించానానన్నారు. 1.30 లక్షల కరపత్రాలను పంచిపెట్టారు.