38.2 C
Hyderabad
May 1, 2024 20: 19 PM
Slider ముఖ్యంశాలు

రామప్ప ఆలయ పూజారులకు, గైడ్ లకు సన్మానం

Ramappa temple

రామప్ప ఆలయంకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా గైడ్ లని, పూజారులను, ఆలయ సిబ్బందిని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సన్మానించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ములుగు సీఐ గుంటి శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సుప్రసిద్ధ కట్టడమైన రామప్ప ఆలయ విశిష్టతను ప్రపంచ నలుమూలల విస్తరింపజేసి, కాకతీయ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి తెలియపరచడంలోను, యునెస్కో ప్రతినిధులకు సైతం మంత్రముగ్దులను చేసేలా అలయ చరిత్ర ను వివరించిన ఆలయ గైడ్ ల కృషి ఎనలేనిదని ఆయన  అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు సీఐ గుంటి శ్రీధర్, వరంగల్ యాక్ రీజినల్ అధ్యక్షుడు సూర రాజేందర్ హాజరయ్యారు.

జిల్లా యాక్ అధ్యక్షుడు పంబిడి శ్రీధర్ రావు అధ్యక్షతన ఆలయ గైడు లు గోరంట్ల విజయ్ కుమార్, తాడబోయిన వెంకటేష్, ఆలయ పూజారి హరీష్ శర్మ, ఉమా శంకర్ లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం రికార్డును సృష్టించడం దేశానికే గర్వకారణమని అన్నారు.

800 ఏళ్ల కాలానికి చెందిన కాకతీయ శిల్పకళా వైభవాన్ని ఖండాంతరాలు దాటించిన ఘనత గైడ్ లకు దక్కుతుందని అన్నారు.ప్ర పంచ దేశాల నుంచి,దేశనలుమూలల నుంచి,విచ్చేసిన పర్యాటకులకు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో పనిచేసే అధికారులకు,ప్రజాప్రతినిధులకు రామప్ప శిల్పకళా సంపద ఘనకీర్తి గురించి గైడ్ లు వివరించిన తీరు వర్ణనాతీతమని అన్నారు.

అనంతరం సీఐ పుట్టిన రోజు సందర్భంగా బోకే అందించి,శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యాక్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల సుమన్, యాక్ సభ్యులు రుద్రోజు బ్రహ్మచారి,ఎస్కే ముస్తఫా,సి హెచ్ నాగరాజు,ఎండీ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

(Free Trial) Best Male Pump Vxl Male Enhancement Pill Best Supplement For Premature Ejaculation

Bhavani

ఎన్నికల ఆదేశాలను కచ్చితంగా అమలు జరగాలి

Satyam NEWS

దళితబంధు ప్రారంభించక పోతే చర్యలు

Murali Krishna

Leave a Comment