37.2 C
Hyderabad
May 6, 2024 19: 12 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో తైబజార్ వేలం పాటకు తగ్గిన ధర

#Bichkunda Taibazar

బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో తైబజార్ వేలం పాట శనివారం జరిగింది.ఈ వేలంపాట గత రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. శనివారం మూడోసారి వేలం పాట పోటాపోటీగా జరగగా  బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మహమూద్ 8 లక్షల 55లక్షల రూపాయలకు వేలంపాటను చేజిక్కించుకున్నారు.

గత సంవత్సరం జరిగిన వేలం పాట 9 లక్షలు 67వేల రూపాయలు దక్కించుకోగా ఈ ఏడు లక్ష  పైచిలుకు  తగ్గింది. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు నష్టపోవల్సి వచ్చిందని అందుకు ఎవరూ కూడా సాహసం చేయకపోవడంతో లక్ష రూపాయ తగ్గినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

ఈ వేలంపాట కార్యక్రమంలో ముందస్తు సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు  వేలంపాట దక్కించుకున్న వారు ఆ సొమ్ములో సగం సొమ్మును గ్రామ పంచాయతీకి  చెల్లించి గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు ధరల ప్రకారం మాత్రమే వ్యాపారుల వద్ద రుసుములు వసూలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ శ్రీరేఖ రాజు ఉపసర్పంచ్ నాగరాజు వేలంపాటదారులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

Another controversy: భారత్ వ్యతిరేకి అయిన బ్రిటన్ నేతతో రాహుల్ భేటీ

Satyam NEWS

చెట్లు కొట్టేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ జరిమానా

Satyam NEWS

కోవూరు దళిత వాడలో కానిస్టేబుల్ దారుణం…

Satyam NEWS

Leave a Comment