28.7 C
Hyderabad
May 6, 2024 09: 17 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో ఘనంగా బాలికల దినోత్సవం

#President Acharya Gyam Sundaravalli

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో జాతీయ సేవా పధకం (ఎన్ ఎస్ ఎస్ ) ఆధ్వర్యంలో ఘనం జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉపకుపతి ఆచార్య జి యం సుందరవల్లి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అమ్మాయి సమాజంలో ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేటికి కూడ సమాజంలో బాలికల పట్ల వివక్షత కొనసాగుతున్నది అని వారి తల్లి దండ్రులు బాలబాలికలిద్దరిని సమాన స్ధాయిలో ప్రోత్సాహించాలని కోరారు. నేను కూడా ఈ స్ధాయిలో అభివృద్ధి చెందడానికి నా తండ్రి మరియు నా భర్త ఎంతో పోచాహఉందని అన్నారు. నేడు ప్రతి బాలిక సావిత్రి బాయి పులే ని స్మరించుకొని, ఆమె ఎదురుకొన్న ఒడిదుడుకులను గుర్తించుకోవాలన్నారు. ప్రతి మహిళా విజయం వెనుక పురుషుని ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

ప్రతి బాలిక వివాహం అయిన తరువాత నిరుత్సాహపడకుడదని జీవితంలో ఎదో ఒకటి సాదించాలని అన్నారు.
ఈ సమాజంలో స్త్రీ విద్య కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి కూడా దోహదపడుతుంది అని తెలిపారు.
మహిళా సాధికారత మరియు పిల్లల భవిష్యత్తు మహిళా విద్యవంతురాలు అయితేనే సాద్యమవుతుదన్నారు.

ఈ సమాజంలో స్త్రీ పురుషులు ఒకరిని ఒక్కరు సహకరించుకోని కలసిమెలసి జీవించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ పి.రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మహిళకి సమాజంలో భద్రత కల్పించాలన్నారు.
మహిళకు ఎలాంటి సమస్య లు ఎదురైనా కనుచూపు మేరలో జరిగిన వారికి అండగా నిలవాలని అన్నారు.

బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయ నంద్ కుమార్ బాబు, ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డాక్టర్ ఉదయ శంకర్ అల్లం . ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీస్స్ డాక్టర్. కే సునీత, డాక్టర్ విద్య ప్రభాకర్, డాక్టర్ ఆర్ మధుమతి,భోధన భోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

మేం చేసిన వాటికే మళ్లీ శంకుస్థాపనలా?

Satyam NEWS

జాతీయ మానవ హక్కుల-నేర నిరోధక సంఘం

Satyam NEWS

Leave a Comment