37.2 C
Hyderabad
May 6, 2024 12: 48 PM
Slider ప్రపంచం

పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచ దేశాల పాలిట కరోనా వైరస్ శనిలా మారింది. తగ్గినట్టే తగ్గి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 కోట్లను దాటింది. అత్యధికంగా అమెరికాలో 4.6 కోట్ల కేసులు నమోదుకాగా.. భారత్‌లో 3.43  కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

డెల్లా వెరియంట్‌ ప్రభావంతో వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రభావంతో మొదట్లో కేసులు తగ్గగా.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత మూడు మాసాలుగా రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 36శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి 90 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది డెల్టా వేరియంట్ బారినపడుతున్నారు.

యూరప్‌లోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సరిగ్గా జరలేదు. దీంతో  కరోనా పాజిటివ్‌ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్‌లో నాలుగు నెలల్లో 10 లక్షలు, రష్యాలో 88 లక్షల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రష్యాలో ప్రతిరోజు వేయి మందికి పైగా కరోనా బారినపడి మృతి చెందుతున్నారు.

Related posts

పంచాయతీలో వ్యర్థ పదార్థాలు ఎరువుగా మార్చాలి

Satyam NEWS

చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా నివాళులు

Satyam NEWS

నాణ్యమైన వస్త్రాలు- సరసమైన ధరలు..ఆకట్టుకుంటున్న చేనేత ప్రదర్శన

Bhavani

Leave a Comment