29.7 C
Hyderabad
April 29, 2024 10: 46 AM
Slider నిజామాబాద్

చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా నివాళులు

chandrasekhara azaad

భారత జాతీయోద్యమ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ 89 వ వర్ధంతి సందర్భంగా PYL-PDSU ఆధ్వర్యంలో కుమార్ నారయణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా PYL రాష్ట్ర నాయకులు సుమన్, PDSU ఆర్మూర్ ఏరియా  ప్రధాన కార్యదర్శి D.నిఖిల్ లు మాట్లాడుతూ బ్రిటిషర్ల వలస పాలన కు వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ పిన్న వయసులోనే పోరాటంలో పాల్గొని భారత స్వాతంత్ర్యం కోసం పాతికేళ్ల ప్రాయం లోనే తన ప్రాణాలు అర్పించారని అన్నారు.

అటువంటి పోరాట యోధుని స్పూర్తి తో నేటి విద్యార్థి, యువతరం దేశం లో జరుగుతున్న మత విద్వేషాలకు వ్యతిరేకంగా, స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఆనాడు స్వతంత్రం కోసం కులం, మతం అనే తేడా లేకుండా భారతీయులుగా ఉద్యమించి ఈ దేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేస్తే ఇప్పుడు గాడ్సే వారసులు పాలనలోకి వచ్చారని అన్నారు.

కలిసి ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల ఐక్యత ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న వారి ఎత్తుగడలను ఆజాద్ చంద్రశేఖర్ స్పూర్తి తో చిత్తు చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  PYL ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ , శ్రీనివాస్,  యుగంధర్, రాజ్ మహ్మద్,  PDSU ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షులు సాయి కుమార్, సహాయ కార్యదర్శి దయాకర్, కోశాధికారి ఈశ్వర్, అజయ్,సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దిశ యాప్ డౌన్ లోడ్ పై విజయనగరం ఎస్పీ యాక్షన్ ప్లాన్…!

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment