28.7 C
Hyderabad
May 6, 2024 07: 43 AM
Slider ఆదిలాబాద్

పంచాయతీలో వ్యర్థ పదార్థాలు ఎరువుగా మార్చాలి

#AsifabadCollector

గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు జమ చేసే తడి పొడి చెత్త వ్యర్థ పదార్ధాలు ఎరువుగా మార్చాలని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంలో ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఐకెపి సిబ్బంది, పంచాయితీ సర్పంచులు, పంచాయతీ సిబ్బందితో వ్యర్థ పదార్థాల నిర్వహణ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలలో ప్రతిరోజు జమ చేసే చెత్తను ఎరువుగా మార్చాలని సూచించారు.

దీనివల్ల పంచాయతీ పరిధిలో పంటలు పండి మంచి దిగుబడి వస్తుందన్నారు. దీనివల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అన్నారు అలాగే పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం ప్రణాళికాబద్ధంగా ఉండాలని సూచించారు. పల్లె ప్రకృతి వనరులకు ఎంపిక చేసుకున్న స్థలాలను ఆధారంగా మొక్కలు నాటాలి అన్నారు.

మొక్కలు నాటే క్రమంలో 3 వరుసలు నాటాలని సూచించారు. దీనిలో మొదటి వరుస పెద్దగా పెరిగే చెట్లు రెండో వరుస కొంచెం చిన్నగా పెరిగేవి మూడవ దశలో మరింత చిన్నగా పెరిగే చెట్లు పెంచాలన్నారు. దీనివల్ల పల్లె ప్రకృతి వరాలు అందంగా కనిపిస్తాయని తెలిపారు.

వీటిల్లో ఎట్టిపరిస్థితుల్లో పూల మొక్కలు నాటకూడదని సూచించారు. పల్లె ప్రకృతి వనం అటవీ ప్లాంటేషన్ వలె ఉండాలన్నారు. మొక్కలు తప్పనిసరిగా దూరం దూరం నాటాలని సూచించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా గ్రామ పంచాయతీలలో చేసే పనులు ఉండాలని అన్నారు.

ప్రకృతి వనాలు విస్తీర్ణం 40 గుంటలలో ఉన్నట్లయితే నాలుగు వేల మొక్కలు, 30 గుంటలు అయితే మూడు వేలు, 20 గుంటల అయితే రెండు వేల మొక్కలు ఉండేలా చూడాలని సూచించారు పనుల్లో అలసత్వం వహించడం కూడదని తెలిపారు. అనంతరం సిబ్బంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తడి, పొడి చెత్తను ఎరువుగా తయారు చేసే విధానం, వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధానం, పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటే విధానాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సాయగౌడ్, డిఆర్డిఓ పిడి వెంకట శైలేష్, డి పి ఓ రమేష్, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ ఏపీడి రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుక నిర్వహించుకోవాలి

Satyam NEWS

హైదరాబాద్ వరద ప్రాంతాలలో అరుణ పర్యటన

Satyam NEWS

బైంస అల్లర్ల బాధితులకు మంత్రాలయ పీఠం బాసట

Satyam NEWS

Leave a Comment