Slider వరంగల్

జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే: తస్లీమా మహమ్మద్

#Taslima Mohammed

సమాజంలో ఉన్న అసమానతలు,కుల, మత,లింగ వవక్షతను రూపుమాపడం కోసం అందరికీ విద్య అందేలా చేసిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ములుగు,భుపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు.

మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేశారు.

అనంతరం తస్లీమా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని త్యాగం చేసి విద్య బోధనకు అంకితం చేశారని, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఆమె ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యసించాలి తస్లీమా అన్నారు. అనంతరం గత సంవత్సరం పదో తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులను తస్లీమా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వందన ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Related posts

మానవాళిని కాపాడుకోవడానికే గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Satyam NEWS

ప్లానింగ్: హామీల అమలుపై అధికారులతో కేజ్రీ

Satyam NEWS

Leave a Comment