42.2 C
Hyderabad
April 26, 2024 16: 38 PM
Slider నల్గొండ

మానవాళిని కాపాడుకోవడానికే గ్రీన్ ఛాలెంజ్

#Green India Challenge

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి ప్రభుత్వహాస్పటల్ లో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మఠంపల్లి ఎంపిపి పార్వతి కొండా నాయక్ 3 మొక్కలు నాటారు. హరిత విప్లవాన్ని సృష్టించాలని సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి అని పిలుపునిచ్చిన స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఛాలెంజ్ ను ఆమె స్వీకరించారు.

మొక్కలు నాటిన అనంతరం ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ మాట్లాడుతూ చెట్లు పెంచడం ద్వారా పర్యావరణం మెరుగౌతుందని, స్వచ్ఛమైన గాలితో మానవుని మనుగడకు ప్రమాదం ఉండదని అన్నారు. కోదాడ RDO ఎల్  కిషోర్, హుజుర్ నగర్ సి.ఐ. రాఘవరావు, హుజుర్ నగర్ జడ్పీటీసీ కోప్పుల సైదిరెడ్డి ఒకొక్కరు ఒక మొక్క నాటాలని ఆమె గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

హరిత విప్లవాన్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అత్యధిక స్థాయిలో మొక్కలు నాటాలి అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే అత్యంత గొప్ప ఆస్తులని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts

భారత్ అగ్ని-5 క్షిపణి పరీక్షలపై చైనా ఆగ్రహం

Sub Editor

తెలంగాణాలో షర్మిలను ఆదరిస్తారా ! కాదు పొమ్మంటారా ?

Satyam NEWS

డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక?

Satyam NEWS

Leave a Comment