నిన్నటి దాక 40 వేల రూపాయలోపే ఉన్న బంగారం ధర అనూహ్యంగా పెరుగుతుంది.పండుగకు,రానున్న రోజుల్లో పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి బంగారం కొనుగోలు చేయాలంటే చెమటలు పడుతున్నాయి.గత రెండు వారాల్లో బంగారం ధర ఏకంగా రూ.2,000కు పైగా ర్యాలీ చేసింది. ఇంకా పసిడి బుల్లిష్ ట్రెండ్‌లోనే నడుస్తోంది.
బంగారం ధర మరింత పెరొచ్చనే అంచనాలున్నాయి.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో జోరు మీదుంది. అడ్డూఅదుపు లేకుండా పరుగులు పెడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర 1.72 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 1579.15 డాలర్లకు ఎగసింది.
ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. కాగా ఇదే తీరు కొనసాగితే మధ్య తరగతి వాళ్ళకి బంగారు ఆభరణాలు అందని ద్రాక్ష గ మారనున్నాయి.