42.2 C
Hyderabad
May 3, 2024 17: 31 PM
Slider ముఖ్యంశాలు

‘‘రేవంత్ రెడ్డిని నేను బహిరంగంగానే సపోర్టు చేశాను’’

#MalluRavi

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫార్సు చేసిన బహిరంగంగానే చెప్పిన తనపై విమర్శలు చేయడం సీనియర్ నాయకుడైన విహెచ్ కి తగదని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ డాక్టర్ ఎంపి మల్లు రవి అన్నారు.

టిపిసిసి పరిశీలకుడు మనిక్కమ్ ఠాగూర్ పైన, తన పైనా, మరి కొంత మంది నాయకులపైన వి.హెచ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. తాను చెంచాగిరి చేస్తున్నట్టు విహెచ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, తాను ఎవరికి చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదని మల్లు రవి అన్నారు.

వైద్య వైద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని తానని మల్లు రవి అన్నారు. 165 మంది నాయకులతో పాటు తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుందని, రేవంత్ రెడ్డి పీసీసీ ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పానని, ఇందులో చెంచాగిరి ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ పైన ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టేనని మల్లు రవి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 165 మంది అన్ని స్థాయి నాయకులను కలిసి ఏఐసీసీ ఇంఛార్జీలు 4 రోజుల పాటు సుదీర్ఘంగా అభిప్రాయ సేకరణ చేశారని ఆయన అన్నారు.

ఇంత లోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలతో మనిక్కమ్ ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు. ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదని మల్లు రవి అన్నారు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి. గతంలో జరిగిన అనేక కీలక నిర్ణయాలలో కూడా సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేసారు.

నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదు, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు అని ఆయన అన్నారు.

Related posts

టీఆర్ఎస్ పార్టీ లో దళితులకు సముచితమైన స్థానం ఇవ్వండి

Satyam NEWS

సదాశివ శర్మకు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

Satyam NEWS

నటులు కైకాల కన్నుమూత

Murali Krishna

Leave a Comment