37.2 C
Hyderabad
May 2, 2024 11: 38 AM
Slider తూర్పుగోదావరి

తుని మున్సిపాల్టీలో చరిత్ర పునరావృతం

#TuniMunicipality

తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ 30 కి 30 వార్డులు కైవసం  చేసుకొని చరిత్రను పునరావృతం  చేసింది.

2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుని మున్సిపాల్టీలో కాంగ్రెస్ పార్టీ 30 కి 30 వార్డులు దక్కించుకుంది.

అప్పటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది రికార్డు సృష్టించింది. ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30 కి 30 వార్డులు ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దక్కించుకుని చరిత్రను పునరావృతం చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో గల 30 వార్డుల్లో 15 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు.

ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్నికలు జరిగిన 15 వార్డులలోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు భారీ మెజార్టీ దక్కించుకుని విజయ కేతనం ఎగురవేశారు.

Related posts

శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుంది:మంత్రి నిరంజన్

Satyam NEWS

అన్యాక్రాంతమైతున్న ప్రభుత్వ భూములు

Satyam NEWS

శ్రీనివాస్ గౌడ్ కేసులో పోలీస్లపై కోర్టు ఆగ్రహం

Bhavani

Leave a Comment