34.2 C
Hyderabad
May 11, 2024 22: 25 PM
Slider ముఖ్యంశాలు

మాతా శిశు సంరక్షణలో  భేష్

#mother

మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలoటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ విధానంతో నాణ్యమైన ప్రసవ సేవలు గర్భిణులకు మరింతగా చేరువైనట్టు పేర్కొంది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటివరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 హాస్పిటల్లలో నియమించింది. వీరు గర్బిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం చేయిస్తున్నారు.

Related posts

సంయుక్తంగా కలిసి పని చేసి కరోనాను తరిమికొట్టాలి

Satyam NEWS

“ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “మాయారే” పాట విడుదల

Satyam NEWS

యువత స్వయం ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయాలి

Satyam NEWS

Leave a Comment