41.2 C
Hyderabad
May 4, 2024 16: 25 PM
Slider హైదరాబాద్

పర్యావరణపై చిత్రాలేఖనానికి విశేష స్పందన

#kvramanachari

కళలు సంస్కారాన్ని, సమర్ధతను పెంచుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె వి రమణాచారి అన్నారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని ” బాల భవన్ లో బాలలకు “పర్యావరణంపై చిత్రాలేఖనం పోటీ ‘ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి డాక్టర్ కె వి రమణాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జలమండలి డిప్యూటీ కంజర్వేటర్ ఫారస్ట్స్ అధికారి కొండా మోహన్ ( డి ఎఫ్ ఓ ), సీనియర్ పాత్రికేయులు బి వి ప్రసాద్, సినీ డైరెక్టర్ వాసు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ…నేడు పర్యావరణం తీవ్ర సంక్షోభంలో ఉందని, బాల్యం నుంచే పర్యావరణం పట్ల అవగాహన పెంచుకోవడమే పరిష్కార మార్గమని సూచించారు.

అద్భుతమైన బాల్యనికి విలువలు జోడించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని అభిలషించారు. కొండా మోహన్, బి వి ప్రసాద్ లు తమ ప్రసంగాల్లో… భవిష్యత్ మీదేనని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన సైనికులు కూడా మీరే కావాలని పిలుపునిచ్చారు. పచ్చ దనాన్ని కాపాడుకోవడం, కాలుష్యాలను కట్టడి తక్షణ కర్తవ్యంగా బాలలకు హితాబోధ చేశారు.

అనంతరం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులు ఉప్పల వెంకటేష్ గుప్త, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య లు అతిధులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇంకా పలువురు పాఠశాలలకు చెందిన కార్యక్రమ సమన్వయ అధ్యాపకులను సత్కరించారు. దాదాపు 600 మంది పుల్లారెడ్డి మెమోరియల్, లోటస్ ల్యాప్, మాడపాటి హనుమంతరావు స్కూల్ , అక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ తదితర పాఠశాలల నుంచి పాల్గొన్నారు. పిల్లలు అద్భుతమైన చిత్రాలు గీచారని అతిధులు కితాబిచ్చారు.  చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా డాక్టర్ రమణాచారి నిర్వాహాకులను అభినందించారు.

Related posts

సగిలేరు డ్యామ్ లో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు

Satyam NEWS

కరోనా అవేర్ నెస్: పసి వయసులోనే పెద్ద ఆలోచన

Satyam NEWS

ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా భట్

Satyam NEWS

Leave a Comment