33.2 C
Hyderabad
May 4, 2024 01: 09 AM
Slider తెలంగాణ

ఆఫర్స్:వనదేవత సేవలో గవర్నర్లు తమిళిసై దత్తాత్రేయ

governers medaram

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం జాతరకు చేరుకున్న గవర్నర్లకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌, అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతలకు గవర్నర్లు, మంత్రులు పూజలు చేసి ముడుపులు సమర్పించుకున్నారు.

వారు మేడారం సమ్మక్క-సారలమ్మ సేవలో పాల్గొన్నారు.గవర్నర్లు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కిలోమీటరు మేర భక్తులు క్యూలో నిల్చొని ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

Related posts

తెలంగాణ LAWCET పరీక్ష తేదీ మార్చాలి

Satyam NEWS

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

Satyam NEWS

ప్రపంచ సంపన్నుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

Satyam NEWS

Leave a Comment