40.2 C
Hyderabad
April 28, 2024 18: 58 PM
Slider ప్రత్యేకం

సీక్రెట్: ఏపిలో బిజెపి దూకుతుందా? దూకదా?

Amit-shah_1

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో బిజెపి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిజంగానే ఉందా? లేక శాసనపరంగా, రాజకీయంగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వేచి చూస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై దూకితే తమకు లబ్ది చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, బిజెపి ఎదురుతిరిగితే ఏం చేయాలా అని వైసిపి అంతర్మధనంలో ఉంది. అయితే బిజెపి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బిజెపిపై దృష్టి సారించాలని కేంద్ర హోం మంత్రి, బిజెపి సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టిన అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఎంపి సీట్లు గెలుచుకోవాలనే వ్యూహంతో ఇప్పటికే ఏపి బిజెపి అడుగులు వేస్తున్నది కానీ అందుకు పరిస్థితులు సహకరించడం లేదు.

వైసిపి పై రాజకీయ పోరాటాలు చేయండి అంటూ ఇప్పటికే బిజెపి తన రాష్ట్ర శాఖకు ఆదేశాలు పంపింది కానీ కేంద్ర ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై బిజెపిలో ఇప్పటికీ స్పష్టత లేదు. వైసిసి ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చూస్తూ కూర్చోవాల్సిందేనా అని రాష్ట్ర బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలా కూర్చోవాల్సిందేనని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అంటుండగా, అలా చేయడం  రాష్ట్రంలో ఆత్మహత్యాసదృశ్యమని మిగిలిన నాయకులు అంటున్నారు.

రాజకీయ, పరిపాలనా పరమైన వ్యవహారాలతో బాటు మరో ముఖ్యమైన సామాజిక అంశంపై కేంద్రంలోని బిజెపి నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలు తమకు కలవరం కలిగిస్తున్నాయని ఇప్పటికే ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు తమ తమ కేంద్ర సంస్థలకు నివేదికలు పంపాయి.

హిందూధార్మిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నదని కూడా వారు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. దీనిపై ఉద్యమం చేసేందుకు కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సీరియస్ గా ఉన్నారు.

Related posts

ప్రజల సమస్యలపై కార్పొరేషన్ పట్టించుకోలేదు..మీరే మాకు దిక్కు

Satyam NEWS

నేడు నాంపల్లి కోర్టుకు వైఎస్ విజ‌య‌మ్మ‌, షర్మిల‌ కొండా దంప‌తులు సురేఖ కొండ మురళి..

Sub Editor

మీడియాలో అసభ్య ఆరోపణలు చేసిన వారిపై కేసు

Satyam NEWS

Leave a Comment