29.7 C
Hyderabad
May 6, 2024 05: 32 AM
Slider హైదరాబాద్

ప్రతి పేదవాడికి వైద్యం అందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

#padmaraogowd

ప్రతి పేదవాడికి వైద్యం అందాలని నగరంలోని అన్ని బస్తీలలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన  మార్పును తీసుకొచ్చిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్  లోని కామ్ గర్ నగర్ లో బస్తి దవాఖాన ను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ప్రారంభించిన పద్మారావు గౌడ్ నగరంలో 350 బస్తి దావఖానల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగానే నేడు 32 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 226 బస్తి దావఖానలను ప్రారంభించామని, వివిధ టెస్టుల తో పాటు ఎక్స్రే ఉచితంగా మందులను కూడా పొందవచ్చని అన్నారు. తెలంగాణలో కరోనా ప్రభావం పెద్దగా లేదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కరోనా నియమాలను తప్పక పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ బస్తీ దవాఖాన లతోపాటు రాష్ట్రంలో పల్లె దవాఖానా లను 4000 ప్రారంభిస్తున్నామని ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరం కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కామ్ ఘర్ నగర్ బస్తీ సంఘం సభ్యులు, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

ఏపిలో అసంతృప్తనేతల చూపు కేసీఆర్ పార్టీ వైపు?

Satyam NEWS

తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ప్రోత్సాహకాలు..!

Satyam NEWS

పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు

Satyam NEWS

Leave a Comment