23.2 C
Hyderabad
May 7, 2024 21: 20 PM
Slider ఖమ్మం

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

#nunna

గత రెండు రోజులుగా గాలి వానలు, అకాల వర్షాలకు, జిల్లాలో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, మిరప, వరి ,మామిడి పంటలు వేసిన రైతులు బాగా నష్టపోయారని సి‌పి‌ఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆరు గాలం కష్టపడి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పంటలు పండి చేతికి వచ్చే సమయాన కురిసిన అకాల వర్షాల వలన రైతులు కోలుకోని విధంగా నష్టపోయారు. పంటల కోసం తెచ్చిన అప్పులకు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు భరోసా  కలిగించేలా నష్టపరిహారం పై ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చాలి

Satyam NEWS

విద్వేషాలను రగిల్చే చిత్రం ‘ది కేరళ స్టోరీ’

Satyam NEWS

Leave a Comment