27.7 C
Hyderabad
May 11, 2024 08: 54 AM
Slider ఆదిలాబాద్

వరద బాధిత ఆదివాసీలను ప్రభుత్వం ఆదుకోవాలి

#tudumdebba

గత ఆరు రోజులుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ వరదల మూలంగా అనేక రకాలుగా నష్టపోయిన ప్రజలందరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు,బ్రి డ్జిలు తెగి పోయి ఇండ్లలో నీరు చేరిందని, దాంతో వేలాది ఆదివాసీల ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. అదే విధంగా పొలాలలో పంట కొట్టుకుపోయి ఎంతో మంది ఆదివాసీ రైతులు నష్టపోయారని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ముంపు బాధితులను ఆదుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధితులకు నిత్యావసర సరుకులు వాటర్,  25000 రూపాయలు తక్షణ సాయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల మూలంగా అనేక విష జ్వరాలు సోకే అవకాశం ఉంది కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆదివాసీ గ్రామాలలో మెడికల్ క్యాంపులు వేసి ప్రజలకు వైద్యం అందించాని కోరారు.

అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రజా స్వామిక వాదులు మేధావులు అందరు కలసి తమ వంతుగా సహాయ సహకారాలు ముంపు బాధితులకు అందచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు గోడం గణేష్, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఉయ్క సంజీవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుంర శ్యాంరావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గోడం రేణుక, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇందిర, ABM జిల్లా అధ్యక్షులు మెస్రం మీనా, డివిజనల్ కమిటీ అధ్యక్షురాలు మెస్రం గంగాదేవి, కుంర సంతాభాయి, మానుకు బాయి, కుడుమేత ప్రకాష్, ఆత్రం గణపతి, ముకుంద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాళేశ్వరం జలకళ ఉత్తిదే: కాంగ్రెస్

Satyam NEWS

విజయవాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి

Satyam NEWS

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

Leave a Comment