కాళేశ్వరం జలకళ అనేది ప్రచారం మాత్రమే అది అంత అబద్ధం. కాళేశ్వరం ప్రాజెక్టు నిండి ఒక్క చుక్క మిడ్ మానేరుకు చేరలేదు… కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి కట్టిన ప్రాజెక్టు నుండి వస్తున్న నీళ్లు అవి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సారధ్యంలో నిర్మించిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు.. దాని నుండి వచ్చిన నీళ్లే ఈరోజు మిడ్ మానేరు కి చేరాయి – అంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శచేశారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సితక్క, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హన్మకొండ హరితహోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులతో టిఆర్ ఎస్ సంబరాలు చేసుకుంటున్నదని వారు అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వారు స్పష్టం చేశారు. మెడిగడ్డ నుండి అన్నారంకు 12 టీఎంసీలు, అన్నారం నుండి సిందిళ్లకు 6 టీఎంసీలు … తెచ్చాం అని చెప్పే సీఎం కేసీఆర్ అవన్నీ తిరిగి గోదావరిలో కలిసి మళ్ళీ కిందకు పోయాయి..దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. వాస్తవాలను దాచి అవస్తవలతో ప్రజలను పక్కా దారి పట్టిస్తున్నారని వారు విమర్శించారు. దీనికి జలహారతి పేరుతో పాలభిషేకలు చేసుకోవడం సిగ్గు చేటు అని వారు అన్నారు.
previous post
next post