33.7 C
Hyderabad
April 29, 2024 02: 23 AM
Slider నిజామాబాద్

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

#Kamareddy Murder

అతనికి బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఇటీవలే గ్రామ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన ఆలోచన పక్కదారి పట్టింది. సొంత కూతురితో కామ వాంఛ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. తరచు కూతురిని లైంగికంగా వేధించసాగాడు.

చివరికి విషయం తన అన్నకు చెప్పడంతో సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతని పేరు తాటిపల్లి మేలయ్య. వయసు 50 సంవత్సరాలు.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం తిప్పపూర్ గ్రామం.

ఒంటరిగా ఉన్న కూతురిపై కన్ను

ఇతనికి ప్రశాంత్, ప్రవళిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రశాంత్ ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. తండ్రి మేలయ్య గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా కొనసాగుతూ ఆటో నడుపుతూ జులయిగా జీవిస్తున్నాడు. మేలయ్య భార్య సునంద, కొడుకు, కోడలు, కూతురు సొంత ఇంట్లో కాకుండా ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

సొంత ఇంటి పని కొనసాగుతుండటంతో అద్దె ఇంట్లో తిని సొంత ఇంట్లో పడుకుంటున్నాడు మేలయ్య. అయితే గత రెండు సంవత్సరాలుగా డిగ్రీ చదువుతున్న కూతురు ప్రవళికపై కన్నేసిన మేలయ్య తన కామ వాంఛ తీర్చాలని వేధించసాగాడు. బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కూతురిని బలవంత పెట్ట సాగాడు.

తండ్రి చేస్తున్న గొడవ అన్నకు చెప్పిన చెల్లి

ఆ సమయంలో ప్రశాంత్ అత్తగారిల్లయిన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఉన్నాడు. రాత్రి జరిగిన ఘటనను అన్నయ్య ప్రశాంత్ కు ఫోన్ చేసి చెప్పింది ప్రవళిక..  రాత్రంతా కత్తి పట్టుకొని ఇంట్లో ఎవ్వరికి నిద్ర లేకుండా చేశాడని అన్నకు చెప్పింది.

చంపుతానని బెదిరించిన గొడ్డలితోనే

ఉదయాన్నే ఇంటికి చేరుకున్న ప్రశాంత్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు.  అందరిని చంపేస్తా అంటూ గొడ్డలితో బెదిరించాడు మేలయ్య. దాంతో అదే గొడ్డలి పట్టుకుని తండ్రి తలపై నరికాడు ప్రశాంత్. అంతే అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు మేలయ్య. వెంటనే ప్రశాంత్ సంబందిత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని గ్రామస్తులు తెలుపుతున్నా పోలీసులు మాత్రం ప్రశాంత్ పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related posts

ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సినిమా ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

Satyam NEWS

లక్ష పత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట

Bhavani

భారత్ తో మరింత సన్నిహిత సంబంధాలకు అమెరికా తహతహ

Satyam NEWS

Leave a Comment