29.7 C
Hyderabad
May 4, 2024 05: 30 AM
Slider నల్గొండ

ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి

#CITUHujurnagar

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక  ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  కార్మికులతో రోషపతి మాట్లాడుతూ కరోనా ప్రారంభ సమయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు పోటాపోటీగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు కరోనా విజృంభణ పెరగగానే చేతులెత్తేశారు అని ఆరోపించారు.

కరోనా సేవలో భాగంగా వైద్య, పారిశుద్ధ్య,పోలీసు, ఆశా వర్కర్లు అలాంటివారు ప్రమాదవశాత్తు కరోనాతో మరణిస్తే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా ప్రభావం తగ్గేంత వరకు సచివాలయ నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలని రోషపతి కోరారు.  

ఇటీవల మరణించిన సిఐటియు జిల్లా నాయకుడు కామ్రేడ్ ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యలక సోమయ్య గౌడ్, దుర్గారావు, రవి, ముత్తమ్మ ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉజ్జయిని మహాకాలేశ్వరుడి ఆలయంలో అపచారం

Satyam NEWS

వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యత

Satyam NEWS

ఆలయ భూమి అడిగితే కేసు పెడతారా..?

Satyam NEWS

Leave a Comment