40.2 C
Hyderabad
May 2, 2024 18: 45 PM
Slider ఆదిలాబాద్

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలి

#AITUCAdilabad

హై కోర్ట్ తీర్పు ప్రకారం మునిసిపల్ కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.24000 చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ డిమాండ్ చేశారు.

నేడు రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ ఫెడరేషన్ తరపున ఆయన ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముసిపల్ విభాగం లో కాంట్రాక్ట్ వ్యవస్థ ను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ మేరకు బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పాల్గొని మాట్లాడుతూ సమస్యల సాధనకై కలసి కట్టు గా పోరాటం చేయాలని అన్నారు.

యూనియన్ బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రోళ్లను తిట్టిన నోటితో ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటున్నావ్?

Satyam NEWS

భారత్ కు భారీ రుణం ఇచ్చేందుకు సిద్ధమైన ఏడిబి

Satyam NEWS

Movie Review: మాస్ ను తృప్తి పరిచే ఎంటర్ టైనర్ ‘‘పొగరు’’

Satyam NEWS

Leave a Comment