38.2 C
Hyderabad
May 5, 2024 22: 43 PM
Slider నిజామాబాద్

ఆలయ భూమి అడిగితే కేసు పెడతారా..?

#kamareddy

కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం ఇచ్చిన భూమిలో వెంచర్ ఏర్పాటును నెల రోజుల క్రితం అడ్డుకున్నందుకు గ్రామానికి చెందిన నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. దాంతో పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ భూమి విషయంలో జ్యోక్యం దేనికని ప్రశ్నించారు. వెంటనే నలుగురిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

సుమారు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే గ్రామస్తులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం కేదారినాథ్ పంతులు పబ్బ జగన్నాథం గ్రామానికి వచ్చి శివాలయం నిర్మించడం కోసం స్థలం కావాలంటే గ్రామస్తులంతా కలిసి 3.15 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చామన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఆ స్థలంలో పదహారు నాగళ్లతో దున్నామని, హోమము, యజ్ఞం చేశామని, శివలింగాలు, నంది విగ్రహాలను 3 గజాల గోతిలో ఉంచామన్నారు. తమను పదేళ్ల పాటు మభ్యపెట్టిన పబ్బ జగన్నాథం పంతులు కొందరితో కుమ్మక్కయ్యారన్నారు.

దాంతో గ్రామ సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి, సుధాకర్ రావు, పబ్బ జగన్నాథం, అశోక్ రావు అనే వ్యక్తులు ఆ స్థలంలో వెంచర్ చేయడానికి పూనుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి నెల రోజుల క్రితం గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని, అధికార పార్టీ నాయకుల అండతో గ్రామానికి చెందిన జూకంటి చిన్న వెంకట్ రెడ్డి, మల్లేశం, మల్లాగౌడ్, వీరేశం లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.

పై వ్యక్తులు ఆ రోజు ఏమి మాట్లాడకున్నా ఫిర్యాదు చేసారని ఆరోపించారు. పోలీసులు వారిని స్టేషన్ కు తేవడంతో గ్రామస్తులందరం ఇక్కడికి వచ్చామన్నారు. అక్రమంగా ఆలయ భూమి కబ్జాకు ప్రయత్నించడమే కాకుండా గ్రామస్తులపై ఫిర్యాదు చేసిన జగన్నాథం, సుధాకర్ రావు, జనార్దన్ రెడ్డి, అశోక్ రావులపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు. ఆలయ భూమిలో వెంచర్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల ఆందోళన

Related posts

కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్ రికవరీ చేసిన”అ” నలుగురు”

Satyam NEWS

ఎగ్జిట్ పోల్స్ : ఢిల్లీలో అధికారం ఆమ్ఆద్మీ పార్టీదే

Satyam NEWS

స్పంద‌న కార్య‌క్ర‌మం: మరోసారి స‌మ‌స్య‌తో వ‌చ్చిన టీడీపీ….!

Satyam NEWS

Leave a Comment