32.2 C
Hyderabad
May 12, 2024 21: 36 PM
Slider మహబూబ్ నగర్

పవిత్ర రంజాన్ ఇంటి వద్దనే జరుపుకోవాలి

kollapur CI 231

రానున్న రంజాన్ పండుగను ప్రశాంతంగా ఇంటి వద్దనే జరుపుకోవాలని కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి కోరారు. కొల్లాపూర్ లో నేడు ఆయన ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీల సభ్యులతో మాట్లాడారు. కరోనా వైరస్ అన్ని చోట్లా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని అందువల్లనే లాక్ డౌన్ నిబంధనలు పెట్టారని సిఐ వివరించారు. రంజాన్ పండుగ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించే వీలు ఉండదని ఆయన చెప్పారు.

రంజాన్ పండుగ సందర్భంగా అందరూ కలిసి నమాజ్ చేసుకునే వీలు ఉండదని ఆయన వివరించారు. ఇఫ్తార్ పార్టీలు చేసుకోవడం తదితర బహిరంగ అంశాలను ప్రభుత్వం నిషేధించినందున ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరు. ఈ నిబంధనలు పెట్టింది కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే అనే విషయాన్ని అందరూ గమనించాలని సిఐ వెంకట్ రెడ్డి కోరారు.

Related posts

కేంద్ర మంత్రిగా అరవింద్ ధర్మపురి?

Bhavani

ఇస్ ఇట్ రైట్:నిర్భయ దోషులను శిక్ష నుంచి తప్పిస్తారా

Satyam NEWS

ఎంక్వయిరీ:ఆలయ వివాదం పై రంగం లోకి ఇంటెలిజెన్స్

Satyam NEWS

Leave a Comment