23.2 C
Hyderabad
May 7, 2024 23: 27 PM
Slider ప్రత్యేకం

ఎంక్వయిరీ:ఆలయ వివాదం పై రంగం లోకి ఇంటెలిజెన్స్

vemulawada temple issue govt probe inteligence

గత వారం రోజులు గా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో జరుగుతున్నా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరింది.వేములవాడ ఆలయ ఈ.ఓ కృష్ణవేణి కలెక్టర్ కృష్ణ భాస్కర్ ల మధ్య వివాదం ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ కు కారణం కాగా వేములవాడ లో అసలు ఏంజరిగుతుందనే నివేదిక తో పాటు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గత 40 రోజులుగా వేములవాడ కు ఎంత మంది భక్తులు విచ్చేసారు అనే నివేదికను కూడా కోరినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు రంగం లోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ డిపార్ట్మెంట్ లని కలిసి వివారాలు సేకరిస్తున్నారు.దేవాలయం,ఆర్టీసీ ,ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులను కలిసి ఈ గణాంకాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.రెండు నెలల నుండి వేములవాడ కు చేరుకుంటున్న భక్తులు ఒక్కో సోమవారం,శని ఆది వారాలతో పాటు, సెలవు దినాల్లో శివరాత్రి కి విచ్చేసే భక్తుల కంటే ఎక్కువ సంఖ్య లో రాజన్న ను దర్శించు కునేందుకు వేములవాడ కు చేరుకున్నారు.వీరికి వసతి,దర్శన కల్పనలో ఆలయ ఈ.ఓ ఉద్యోగులు నిరంతరం శ్రమించారు.

ఈ విషయమై జిల్లా అధికారులు భక్తుల ఏర్పాట్ల పై ఎందుకు శ్రద్ద చూపలేదని అంశమై ముఖ్య మంత్రి కార్యాలయం,జిల్లా మంత్రి నుండి విచారణ జరుపాలని ఇంటెలిజెన్స్ను కోరినట్లు సమాచారం.కాగా ఆలయం లో జరుగుతున్నా పరిణామాలపై సత్యం న్యూస్ లో వచ్చిన వార్తలకు ప్రభుత్వం స్పందించి ఈ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Related posts

మంత్రి పెద్దిరెడ్డి ప్రాణాల విలువ తెలియని రాక్షసుడు

Satyam NEWS

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

జన నేత కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment