41.2 C
Hyderabad
May 4, 2024 17: 45 PM
Slider సినిమా

ఎన్టీఆర్ కీర్తి సాఫల్య పురస్కారానికి ఎంపికైన గుంటి పిచ్చయ్య

#guntipichiah

ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు కీర్తి జీవిత సాఫల్య పురస్కారానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల నివాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య ఎంపికైనట్లు ఫిలిం ట్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా తెలిపారు.

బాల్యము నుండి కళలపట్ల ఆసక్తి పెంచుకొని ఏకపాత్రాభినయాలు,చిన్న చిన్న నాటికలు,నృత్య ప్రదర్శనలతో ప్రారంభించి సాంఘిక నాటకాలు, నాటికలు,1989 సంవత్సరం నుండి ప్రదర్శనలిస్తూ జిల్లాస్థాయి,రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలలో అనేక ప్రదర్శనలు ఇస్తూ 2006లో శ్రీ యువ భారతి సాహిత్య సాంస్కృతిక కళా సమితి ఏర్పాటు చేసుకుని 2007లో ప్రభుత్వంచే రిజిస్ట్రేషన్ చేయించి 2015, 2016,2017,2018 సంవత్సరాలలో తన సొంత ఖర్చులతో క్యాలెండర్, డైరీలను ముద్రించి నియోజకవర్గ,జిల్లా స్థాయిలో స్వయంగా జిల్లా స్థాయి కళాకారుల వివరములు,పలు స్వచ్ఛంద సంస్థలకు తెలియజేసి కళాకారుల ప్రతిభను వెలికితీసి అనేక సంస్థల ద్వారా పురస్కారాలు పొందడానికి దోహదపడ్డారు గుంటి పిచ్చయ్య.

కళామతల్లి ముద్దుబిడ్డగా పేరు గడించారు.నంది,హనుమ,గరుడ లాంటి గొప్ప నాటకోత్సవాలలో పాల్గొని పలు ప్రదర్శనలు ఇచ్చారు.బుల్లితెర సినిమాలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ రంగస్థలం సినీ,బుల్లితెర కళాకారుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య కు పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు జీవిత సాఫల్య పురస్కారం రావడం అభినందనీయమని ప్రముఖ టీవీ నటులు సప్తగిరి ఛానల్ గురుస్వామి,నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు, ప్రముఖ జాతీయ కళాకారులు టీవీ రంగయ్య,టీవీ నటులు కార్తీక్,వెంకీ అభినందించారు.

పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలకు విచ్చేయుచున్న అతిథులు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి,తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్,గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రణాళిక రంగ ఉపాధ్యక్షుడు శాసనసభ్యుడు మల్లాది విష్ణు వర్ధన్, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య ప్రసాద్,ఊడవెల్లి శ్రీదేవి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా ఈ నెల 30న, విజయవాడ నగరంలోని హోటల్ ఐలాపురం నందు అందుకుంటున్నట్లు ఫిలిం ట్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ గుంటి పిచ్చయ్య 118 మంది కళాకారుల జీవిత చరిత్రను సావనీరు 2022 ప్రముఖులచే త్వరలో ఆవిష్కరిస్తున్న ట్లు తెలిపారు.

Related posts

ఎన్​కౌంటర్​ లో రాజకీయ నేత​ కుమారుడు హతం

Bhavani

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Bhavani

ప్రతి పేదవానికి సొంత ఇల్లు

Bhavani

Leave a Comment