33.7 C
Hyderabad
April 29, 2024 01: 16 AM
Slider ప్రత్యేకం

జూపల్లి…. భీరం వర్గీయులు ఢీ అంటే ఢీ

#jupallikrishnarao

నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి లో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన వర్గానికి చెందిన వారిని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అకారణంగా కొట్టడం సరికాదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు.

పోలీస్ స్టేషన్ వద్ద కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి జూపల్లికి తారస పడటంతో జూపల్లి మరియు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య పోలీస్ స్టేషన్ ముందే తోపులాట జరిగింది. ఏక పక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై ని వెంటనే సస్పెండ్ చేయాలని రాస్తారోకో చేపట్టారు జూపల్లి కృష్ణారావు అనుచరులు.

అనంతరం జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకుని తన అనుచరులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.

Related posts

ఉత్తమ్ కు రాఖీ కట్టిన ఆయన సోదరి

Satyam NEWS

కపలవాయి విజయ కుమార్ కు ప్రతిష్టాత్మక GJC అవార్డు

Satyam NEWS

గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్

Satyam NEWS

Leave a Comment