39.2 C
Hyderabad
May 3, 2024 14: 00 PM
Slider ముఖ్యంశాలు

ఎన్​కౌంటర్​ లో రాజకీయ నేత​ కుమారుడు హతం

#Uttar Pradesh gangster

యూపీ పోలీసుల ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతిఖ్​ అహ్మద్​ కుమారుడు హతమయ్యాడు. న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతడితోపాటు మరొకరు కూడా చనిపోయారు.ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్​కౌంటర్​లో హతమయ్యాడు.​ ఝాన్సీలో యూపీ స్పెషల్ టాస్క్​ ఫోర్స్​తో జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడు.

అసద్​తోపాటు గులామ్ అనే మరొక వ్యక్తి కూడా ఎన్​కౌంటర్​లో చనిపోయాడు. ప్రయాగ్​రాజ్​కు చెందిన న్యాయవాది ఉమేశ్​ పాల్​ హత్య కేసులో వీరిద్దరిపై రూ.5లక్షలు చొప్పున రివార్డు ఉంది. మృతుల నుంచి అధునాతన విదేశీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఉమేశ్​ పాల్ కిడ్నాప్ కేసులో అతిఖ్​ అహ్మద్​కు ఇప్పటికే జీవిత ఖైదు పడింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు. ఉమేశ్​ పాల్ హత్య కేసుకు సంబంధించి అతిఖ్​ను, అతడి సోదరుడు అష్రఫ్​ను ప్రయాగ్​రాజ్​లోని కోర్టుకు తీసుకువచ్చారు. వారు న్యాయస్థానంలో ఉండగానే అసద్​ ఎన్​కౌంటర్​ సమాచారం తెలిసింది. వెంటనే అతిఖ్​ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.

Related posts

వైఎస్సార్సీపీ మైనార్టీ నేతలు ఫోన్ లోనే పంచాయతీ…!

Bhavani

వేములవాడ వాసుల బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

కన్నుల పండువగా కొత్తపేట ప్రభల ఉత్సవం

Bhavani

Leave a Comment