28.7 C
Hyderabad
May 5, 2024 07: 34 AM
Slider హైదరాబాద్

మహాపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

#Ravindrabharati

భారతీయ తత్వం, ధర్మ మేళవింపుగా సనాతన వాదాన్ని తులనాత్మకంగా విశ్లేషించి జగద్విదితం చేసిన సామాజిక తత్వంచింతాపరుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని వక్తలు కొనియాడారు.

శనివారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించిన మహా మహా ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 132వ జయంతి సభ గాన సభ  అధ్యక్షుడు కళా వి.ఎస్ జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా రాధాకృష్ణణ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ సీనియర్ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ అధ్యాపకుడిగా రాధాకృష్ణన్ సేవలు నిరూపమానం అని అన్నారు.

ఆయన జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా, గురుపూజోత్సవంగా జరుపుకోవడం విశేషమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ శ్వాసకోస వైద్య నిపుణులు డాక్టర్ విష్ణున్ రావు, సాధన సాహితీ స్రవంతి అధినేత సాధన నరసింహాచార్య, గాన సభ పాలకవర్గ సభ్యులు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు

Satyam NEWS

ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే షోలో భాగమైనందుకు సంతోషం

Satyam NEWS

ప్రమాదం చేయని డ్రైవర్లకు క్యాష్ అవార్డులు

Satyam NEWS

Leave a Comment